మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరం ప్రాంతంలో గురువారం 30 31 0 20 నెంబరు గల చౌక దుకాణం పై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. దుకాణంలో ఉన్న బియ్యపు నిల్వలను పరిశీలించారు. చౌక దుకాణంలో రికార్డుల ప్రకారం 109.86 కింటల రేషన్ బియ్యం నిల్వ ఉండాల్సి ఉండగా 91 క్వింటాలు మాత్రమే బియ్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో రేషన్ షాప్ లో ఉన్న బియ్యం తేడా రావడంతో డీలర్ నునావత్ వెంకటేశ్వర్లు పై 6 ఏ కేసు నమోదు చేసి ఆ షాపులు సీజ్ చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారి హన్నన్ సివిల్ సప్లై డిటి సోయం కృష్ణ తెలిపారు.