మన్యం న్యూస్ వాజేడు.
మండల కేంద్రంలోని చండుపట్ల క్రాస్, జాతీయ రహదారిపై గురువారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా పేరూరు ఎస్సై హరీష్ మాట్లాడుతూ..గ్రామాలు, జాతీయ రహదారి సమీపంలో చైన్‌స్నాచింగ్ ఘటనలు జరుగకుండా రహదారులపై విస్తృత తనిఖీలు చేస్తున్నామన్నారు. రిజిస్ట్రేషన్, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫైన్‌లు వెంటనే చెల్లించాలని, చలాన్లు ఎక్కువ మొత్తంలో ఉన్నట్లయితే వాహనాలను సీజ్ చేస్తామన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.మద్యం తాగి వాహనాలను నడుపొద్దు అనుమానితులనఆపి విచారించారు.వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దన్నారు. ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ లేకుండా రోడ్డుపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రతి వాహనదారుడు విధిగా హెల్మెట్ ధరించాలి ప్రధాన రహదారిపై పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ పత్రాలను పరిశీలించారు. పత్రాలు,నంబర్ ప్లేట్ లేని వాహనాల యజమానులకు జరిమానా విధిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. తనిఖీల్లో సివిల్, సిఆర్పిఎఫ్ జవాన్లు పాల్గొన్నారు.