UPDATES  

 బాలుడికి కుక్కకాటు. డాక్టర్లు సమాధానమిదే..!

 

మాన్యం న్యూస్, దమ్మపేట, ఏప్రిల్, 20: దమ్మపేట మండలం, లచ్చాపురం గ్రామంలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. బాలుడు ఇంటి దగ్గర ఆడుకుంటున్న సమయంలో రెండు కుక్కలు బాలుడిపై దాడి చేశాయి. కుక్కల దాడిలో బాలుడు చేతికి బాగా గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు దమ్మపేట ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్లారు. ప్రభుత్వ హాస్పిటల్ లో వ్యాక్సిన్ లేదని డాక్టర్లు చెప్పారు. కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్లాలని రిఫర్ చేశారు. అయితే ప్రభుత్వ హాస్పిటల్ లో వ్యాక్సిన్ లేకపోవడంపై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగూడెం అంటే 150 కిలో మీటర్లు వెళ్లాల్సి వస్తుందని, ఆ లోపు పిల్లాడికి ఏమైనా అవుతుందోమేనని టెన్షన్ పడ్డామన్నారు. ఇప్పటి కయినా అధికారులు స్పందించి ఈ లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కుక్కలా బెడద లేకుండా చూడాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !