మన్యం న్యూస్.ములకలపల్లి:ఏప్రిల్ 20.ఇంద్రవెల్లి నెత్తుటి జ్ఞాపకానికి 42 ఏళ్ళు నిండిన సందర్భంగా ఆ ఘటనలో మృతి చెందిన ఆదివాసీ అమరులకు ములకలపల్లి మండలం సోయం గంగులుగూడెం గ్రామంలో జరిగిన అమరవీరుల సభలో ఘనంగా నివాళులర్పించారు. సోయం కన్నారాజు ఆదివాసీ 9 తెగల సమన్వయ కర్త, పోడియం బాలరాజు ఏ ఈ డబ్ల్యు సి ఏ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు, మాట్లాడారు. జల్ జంగిల్ జమీన్ నినాదం తో ర్యాలీ నిర్వహిస్తున్న ఆదివాసి బిడ్డలను 1981 లో అప్పటి ప్రభుత్వం అత్యంత పాశవికంగా కాల్చిచంపిందని ఆ ఘటనలో 100 మంది ఆదివాసీలు చనిపోయారన్నారు. 42 ఏళ్ళు కావస్తున్నా ఆ డిమాండ్ల తో పాటు ఆదివాసీల మనుగడ కోసం అనేక డిమాండ్లు చేరాయన్నారు. ఆదివాసీల మనగడ అడవితో ముడిపడిందని అడవిపై హక్కు ముమ్మాటికీ ఆదివాసీలదే అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆదివాసీ ప్రాంతాలు దోపిడీకి గురవుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న విలువైన సంపద దోపిడీకి గురవుతుందని, పెట్టుబడిదారులకు, బహుళ జాతి కంపెనీలకు షెడ్యూల్ ప్రాంతాలను అప్పజెడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తక్షణమే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని, ఓపెన్ కాస్ట్ నిలిపివేయాలని, ఏజెన్సీ లో 100 ఉద్యోగాలు ఆదివాసీలతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలు ఇంద్రవెల్లి అమరుల స్పూర్తితో జాతికోసం పోరాడాలని , ఇంద్రవెల్లి అమరుల ఆశయ సాధనకు కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో మడకం శ్రీను ఏడీఈ ఏఈడబ్ల్యుసిఏ, సనప కోటేశ్వరరావు (తుడుదెబ్బ జిల్లా అధ్యక్షులు)వర్స లక్షయ్య, గానిబోయిన చింపిరయ్య, పాలేబొయిన వెంకటేశ్వర్లు, ఊకే ముక్తేశ్వరవు, సోయం సత్యనారాయణ, కొండ్రు సుధారాణి, సోయం చిన్నారి, సోడియం రాజేశ్వరరావు, పద్దం ప్రభాకర్, కొండ్రు పద్మ, ఊకే పెద్దమ్మాయి తదితరులు పాల్గొన్నారు.
