మున్సిపల్ కమిషనర్ని సన్మానించిన పారిశుద్ధ్య కార్మికులు మన్యంన్యూస్,ఇల్లందు టౌన్…ఇల్లందు మున్సిపల్ కమిషనర్ గా షేక్ అంకుషావలి పదవీ బాధ్యతలు తీసుకొని సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం ఇల్లందు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కార్మికులు పూలమాలలు వేసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఇఫ్టు అనుబంధ జిల్లా కోశాధికారి మాట్లశ్రీను నాయకులు నాయిని కృష్ణ, ఎండి ఫయాజ్ లు మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికై కమిషనర్ అంకుషావలి విశేషకృషి చేశారని తెలిపారు. ఎన్ఎంఆర్ కార్మికుల పిఎఫ్ సమస్య అయిన రూ.45 లక్షల రూపాయలు, ఈఎస్ఐ బకాయిలు రూ. 12 లక్షల రూపాయలు కార్మికుల అకౌంట్లో జమ అయ్యాయని దీనికి ప్రధాన కారణం కమిషనర్ అని పేర్కొన్నారు. జీవో నెంబర్ 60 ప్రకారం మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు 15,600 వేతనం గత సంవత్సరం ఆగస్టు నుంచి చెల్లిస్తున్నారని గుర్తుచేశారు.కార్మికులకు రెయిన్ కోట్లు, బట్టలు, చెప్పులు, కొబ్బరి నూనె, సబ్బులు సైతం కార్మికులకు ఇచ్చారన్నారు. ఇప్పటివరకు కార్మికుల జీతాలు బకాయిలు లేకుండా తారీకులు కాస్త అటు ఇటు అయినా క్రమం తప్పకుండా వస్తున్నాయన్నారు. కమిషనర్ గా ఇల్లందుకు వచ్చిన సంవత్సరకాలంలోనే మున్సిపల్ కార్మికుల అనేక సమస్యల పరిష్కారానికై కృషి చేసిన అంకుషావలికి కార్మికులు, కార్మిక నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, శానిటరీ ఎస్సై రాధాకృ ష్ణ, జవాన్లు మాట్ల లక్ష్మణ్, కళ్యాణ్, పారిశుధ్య కార్మికులు బోయపోతుల వెంకన్న, భారతి, ఉమా, సంజీవ్, వరలక్ష్మి, మీనా, వేణు, రవి తదితరులు పాల్గొన్నారు
