దళిత మేధావులారా…… ఆలోచించండి
తెలంగాణ పాలనా సౌదానికి అంబేద్కర్ పేరు!
నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టరు?
పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన భద్రాది జిల్లాకు పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయించా!
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ మాయగాళ్లకు కనిపించదా?
నియోజకవర్గ అభివృద్ధికి మణుగూరులో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహం సాక్షి.
మన్యం న్యూస్, ప్రతినిధి:
తెలంగాణ పాలనా సౌదానికి అంబేద్కర్ పేరు పెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి అని, దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ దే అని పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే రేగా కాంతారావు ఫేస్బుక్ సాక్షిగా మరొక మారు అభివృద్ధి చేయకుండా, పదవుల కోసం పాకులాడే వారిపై ఘాటైన విమర్శలు చేశారు. పార్లమెంటు నూతన భవనానికి అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టరని, ఈ రోజున ప్రతి పౌరుడు అనుభవిస్తున్న హక్కులు రాజ్యాంగం ప్రకారం బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రసాదించిన వరం అని, ఈ విషయమై దళిత మేధావులు ఒకసారి ఆలోచించాలని అన్నారు. పినపాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన భద్రాద్రి జిల్లాకు, పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయించడం జరిగిందని, వేల మందికి ఉద్యోగ ఉపాధికి ఆసరాగా నిలిచిన భద్రాద్రి పవర్ ప్లాంట్ పగటివేషగాళ్లకు కనపడడం లేదా అని విమర్శించారు. తన వంతుగా మణుగూరులో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయించానని, గత పాలకుల గుర్తుగా నియోజకవర్గంలో ఏమైనా ఉందా అని సవాల్ విసిరారు. గతంలో ప్రజలు అధికారం చేతికిచ్చిన అభివృద్ధికి ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు దృష్టిలోపంతో సాధించలేకపోయిన దద్దమ్మలు నేడు పినపాక నియోజకవర్గం అభివృద్ధిపై విమర్శించడం సిగ్గుచేటని స్పష్టం చేశారు.