మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
వివోఎలా పట్ల ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు నిరోధక సమ్మె కొనసాగిస్తామని మండల అధ్యక్షులు గద్దల వెంకటేశ్వర్లు తెలిపారు. సిఐటియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో లక్ష్మీనగరం బ్యాంకు ముందు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 5వ రోజు చేరుకుంది. వారు చేపట్టిన సమ్మెకు వినుతంగా కార్మికులందరూ చెవిలో పువ్వు పెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఐకెపి వివోల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కనీస వేతనం 26000 అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముందుకు వారు ఎనిమిది డిమాండ్లను ముందించారు. ఈ నిరవధిక సమ్మెలో పాల్గొన్నవారు లక్ష్మి కిషన్ వెంకటేష్ శ్యామ్ రాజేశ్వరి అరుణకుమారి లత కృష్ణవేణి వెంకటనరసమ్మ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.