UPDATES  

 వైద్యం వికటించి, బాలుడి కాలుకు ప్రమాదం

  • వైద్యం వికటించి, బాలుడి కాలుకు ప్రమాదం
  • ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న శ్రీనివాస క్లినిక్ వైద్యం
  • లబోదిబోమంటున్నా తల్లిదండ్రులు

 

మన్యం న్యూస్ వాజేడు…ధర్మవరం గ్రామంలో ఆర్ఎంపి వైద్యుడి నిర్లక్ష్యం తో బాలుడి కుడికాలు సచ్చు పడిపోయింది. వివరాలలోకి వెళితే బొగట జనార్ధన్ ములుగు జిల్లా, వాజేడు మండలం, ధర్మవరం గ్రామం, జ్వరంతో బాధపడుతున్న తన కుమారుడు ప్రవీణ్, 2, సంవత్సరాలు స్వగ్రామంలో శ్రీనివాస క్లినిక్ నరసింహ చారి ఆర్ఎంపి వైద్యుడి దగ్గరకు హుటాహుటిన తీసుకొచ్చారు. సద్దనపు నరసింహ చారి లేకపోవడంతో కాంపౌండర్ గా పనిచేస్తున్న శంకర్ అనే వ్యక్తి ఆ బాలుడికి ఇంజక్షన్ వేశారు. టానిక్ రాసిచ్చారు. మరుసటి రోజు నుంచి బాలుడి కుడికాలు నడవలేక నానా ఇబ్బందులు పడేవాడు, కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుక ఊడిపోయినట్లు,జ్వరం వచ్చిందని వైద్యుడి దగ్గరికి వస్తే ఉన్న కాలుని తీసివేసే పరిస్థితి ధర్మవరం గ్రామం, శ్రీనివాస క్లినిక్ లో చోటు చేసుకుంది. నడక నేర్చుకుంటున్న నవ శిశువుకు నడకే నరకంలా మారిన పరిణామం ఆర్ఎంపి వైద్యుడి ఇంజక్షన్ శాపంగా మారింది. ఇప్పుడే బుడిబుడి అడుగులతో నడక నేర్చుకుంటున్న రెండేళ్ల బాలుడి కి ఏం చేస్తే కాలు మళ్లీ నడకనిస్తుందనీ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శ్రీనివాస్ర్ క్లినిక్ ఆర్.ఎం.పి వైద్యుడి నరసింహ చారి వివరణ కోరగా బోగట జనార్ధన్ కుమారుడు ప్రవీణ్ శ్రీనివాస క్లినిక్ లో వైద్యం చేయించుకునేందుకు వచ్చారు. ఆ సమయంలో క్లినిక్లో లేను కాంపౌండర్ శంకర్ ఇంజక్షన్ చేసినట్లు ఆ ఇంజక్షన్ వల్లనే బాలుడి కుడి కాలుకు ఇన్ఫెక్షన్ వచ్చినట్లు తెలిసిన వెంటనే బాలుడి కాలు నడిచే అంతవరకు ఖర్చు మొత్తం పెట్టుకుంటానని బాలుడి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చానని తెలిపారు.
ధర్మవరం గ్రామంలో శ్రీనివాస్ క్లినిక్ లో వైద్యం కోసం వెళ్లిన బాలుడికి ఇంజక్షన్ చేయడం తో బాలుడి కుడికాలు సచ్చుపడిండని వైద్య బృందం బాలుడి రిపోర్ట్స్ ప్రకారం వెల్లడించారు. శ్రీనివాస క్లినిక్ డి ఎం హెచ్ ఓ ఆఫీస్ నుండి పర్మిషన్స్ తీసుకోకుండా నడిపిస్తున్నారని తక్షణమే క్లినిక్ మూసివేయాలని ములుగు జిల్లా విజిలెన్స్ అధికారి మంకిడి వెంకటేశ్వరరావు వైద్య బృందం క్లినిక్ ని మూసివేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !