UPDATES  

 స్థానికుడిగా నాకే అవకాశం ఉంది టీపిసిసి జనరల్ సెక్రెటరీ ఎడవల్లి కృష్ణ

  • అధిష్టానం ఆలోచనలలో
  • నాకే టిక్కెటు నేనే గెలుస్తా
  • స్థానికుడిగా నాకే అవకాశం ఉంది
  • టీపిసిసి జనరల్ సెక్రెటరీ ఎడవల్లి కృష్ణ
  • ఈనెల 24న నిరుద్యోగ నిరసన దీక్ష విజయవంతం చేయండి
  • విలేకరుల ఆత్మీయ సమ్మేళనం లో స్పష్టం చేసిన ఏడవల్లి కృష్ణ

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలలో టిక్కెట్టు తనకే వస్తుందని కొత్తగూడెం నియోజకవర్గంలో తానే గెలుస్తానని టి పి సి సి జనరల్ సెక్రెటరీ ఎడవల్లి కృష్ణ స్పష్టం చేశారు శుక్రవారం జిల్లా కేంద్రంలో కొత్తగూడెంలోని సూర్యా ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల ఆత్మీయ సమ్మేళనలో ఆయన మాట్లాడారు ఈ నెల 24వ తేదీ న ఖమ్మం జిల్లాలో జరుగనున్న నిరుద్యోగ నిరసన దీక్ష ను విజయవంతం చేయాలని,నియోజకవర్గ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ నాయకులకు,కార్యకర్తలకు, అభిమానులకు,నిరుద్యోగయువతకు పిలుపునిచ్చారు.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విచ్చేస్తున్నారని.ఉద్యోగం లేక నిరుద్యోగులు ఏదుర్కొంటున్న బాధలు,కష్టాలు,పోవాలంటే,ఇప్పుడు ఉన్న అధికారపార్టీ బీ.అర్.యస్ నిరుద్యోగులను ఎంత దుర్మార్గంగా ఇబ్బంది పెడుతుంది,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఏమి చేస్తుంది అనే అంశాలపై రేవంత్ రెడ్డి వివరిస్తారని కావున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో ఖమ్మం జిల్లా నిరుద్యోగ నిరసన దీక్ష విజయవంతం చేయాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని నా భుజ స్కందలపై వేసుకొని పార్టీని ముందుకు తీసుకొని వెళ్ళానని.కాంగ్రెస్ పార్టీ కోసం అనునిత్యం కష్టపడి పనిచేస్తున్నానని,ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటూ వారి కష్టాల్లో పలుపంచుకుంటున్ననని అన్నారు,ఏఐసిసి,పిసిసి అదేశనుసరం ప్రతి కార్యక్రమము తుచ తప్పకుండా చేసుకుంటూ పార్టీ అబివృద్దికి పాటు పడుతున్నానని,కొత్తగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ అడ్డ ,కాంగ్రెస్ పార్టీ నుంచి నేనే పోటీ చేస్తానని అధిష్టానం నన్ను ఆదరిస్తుందని స్పష్టం చేశారు ఇక్కడ పోటీ చేసే అర్హత నాకు మాత్రమే ఉందని,స్థానికేతరులకు అవకాశం ఇచ్చే ప్రసక్తి లేదని పార్టీ కోసం అనునిత్యం కష్టపడి పని చేస్తున్నది మీము కార్యకర్తల,నాయకుల మనోధైర్యం దెబ్బ తీయడం కోసం నియోజకవర్గం కానీ వారు,సంబంధం లేని వారు వారి ఇష్టానుసారంగా నెలకు రెండు నెలలకు వచ్చి టికెట్ నాది,ఇంకొకరు వచ్చి టికెట్ నాది అని ఎవరు పడితే వారు వచ్చి స్టేట్మెంట్స్ ఇస్తే ఇక్కడ పార్టీ కోసం కష్టపడి పని చేసే వాళ్ళం పిచ్చి వళ్ళమా..? అని ప్రశ్నించారు .నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట ఇది నా అడ్డ,ఎవరు పడితే వారు వస్త అంటే మా నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని,పార్టీ కోసం మీము నియోజకవర్గంలో ప్రతి గ్రామము,పట్టణం తిరుగుతూ పార్టీ అబివృద్దికి బాటలు వేసింది మీము కాదా అని అన్నారు,సభ్యత్వ నమోదు లో 45వేల సభ్యత్వాలు,10లక్షల రూపాయలు కట్టిన ఘనత మాదే,నియోజకవర్గం బి.సి లకు రిజర్వేషన్,మా కాంగ్రెస్ పార్టీ అన్నీ ఇక్వెషన్స్ చూసి నన్ను ఆదరిస్తుంది అని తెలిపారు అనంతరం ఏడవల్లి కృష్ణ పెళ్లి రోజు సందర్భంగా కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపి సన్మానం చేశారు.
ఈ కార్యక్రమములో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య,కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు బొమ్మిడి మల్లికార్జున్,పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు,లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు సకినాల వెంకటేశ్వరావు,చుంచుపల్లి మండల అధ్యక్షులు అంతోటి పాల్,మాజీ జిల్లా యస్సీ సెల్ అధ్యక్షులు,మాజీ సీనియర్ మున్సిపల్ కౌన్సిలర్ గిన్నారపు నాగేందర్,బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుంటీ జగన్ మోహన్ రావు,పైడిపల్లి మనోహర్ తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !