మన్యం న్యూస్, భద్రాచలం :
భద్రాద్రి గడ్డ.. బిఆర్ఎస్ అడ్డ… మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ
అన్నారు. శనివారం భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి గా బాధ్యతలు తీసుకున్న బాలసాని లక్ష్మీనారాయణ ముందుగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శించుకున్నారు. అనంతరం నియోజకవర్గ ముఖ్యనాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భద్రాద్రి గడ్డ గులాబీ అడ్డ అని అన్నారు. ఈనెల 25వ తారీకున ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగరేసి ఉదయం 10గంటల వరకు అందరూ భద్రాచలం చేరుకోవాలి అని ఆయన కోరారు. భద్రాచలంలో జరగబోవు నియోజకవర్గ స్థాయి మీటింగులో ప్రతి మండలం నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనాలని అన్నారు. ఇకనుండి కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా తను నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అందుబాటులో వుంటాను అని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపడు కుంటాను అని భరోసా కల్పించారు. అలాగే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తలు రెట్టింపు వుత్సహంతో పనిచేసి భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా ఎగుర వేయాదానికి సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అన్నే సత్యనారాయణమూర్తి, చర్ల మండల అధ్యక్షులు సోయం రాజారావు తదితరులు పాల్గొన్నారు.