మన్యం న్యూస్ మణుగూరు టౌన్
మణుగూరు పరిసర గ్రామమైన రామానుజవరం నందు గల శివాలయానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్ధం రూ.44 లక్షల రూపాయలతో సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో నిర్మాణం పూర్తి చేసుకున్న “శ్రీరస్తూ సింగరేణి కళా భవస్” ను శుక్రవారం పూజా కార్యక్రమాలు నిర్వహించి లాంఛనంగా ప్రభుత్వ విప్,శాసన సభ్యులు రేగా కాంతారావు,ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రాంచందర్ చేతుల మీదుగా ప్రారంభిచడం జరిగింది.ఈ సంధర్భంగా విప్ రేగా కాంతారావు కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిధి ప్రభుత్వ విప్,రేగా కాంతారావు మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో అగ్రగామి సంస్థగా విరాజిల్లుతూ,దక్షిణ భారత పారిశ్రామిక మనుగడకు మూలాధారంగా కొనసాగుతున్న సింగరేణి సంస్థ,బొగ్గు ఉత్పత్తి,విద్యుత్ ఉత్పాదకతలో నిర్దిష్ట ప్రణాళికలతో ప్రగతి పథంలో కొనసాగుతూనే,సామాజిక సేవల లోనూ స్పూర్తి దాయక పాత్ర పోషిస్తూ,స్థానిక పట్టణాభివృద్ధితో పాటు, పరిసర గ్రామాల ప్రజల మౌలిక సదుపాయాలు కల్పించటానికి సిఎస్అర్ నిధులతో లక్షలాది రూపాయలు వెచ్చించటం సింగరేణి యజమాన్యం సామాజిక ధృక్పదానికి గొప్ప నిదర్శనం అన్నారు.ఈ “శ్రీరస్తూ సింగరేణి కళా భవస్” ప్రశంసిస్తూ నూతన కమ్యూనిటి హాల్ ను కొండాయి గూడెం,రామానుజవరం గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని తెలియజేశారు.అనంతరం ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామ చందర్ మాట్లాడుతూ,సింగరేణి యజమాన్యం సంస్థ అబివృది, ఉద్యోగుల సంక్షేమం తో పాటు సామాజిక సేవా కూడ సమ ప్రదాన్యత ఇస్తుంది కాబట్టే సామాజిక సేవా కార్యక్రమాల కొరకు ప్రత్యేకంగా సిఎస్ఆర్ విభాగాన్ని ఏర్పాటు చేసి, సింగరేణి ప్రాంతం లో స్థానిక అబివృద్ధికీ,పరిసర గ్రామాల ప్రజల సౌకర్యాల కొరకు లక్షలాది రూపాయలు వెచ్చించడం జరుగుతుంది అన్నారు.అందులో భాగంగానే మన మణుగూరు ఏరియా లో ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ప్రతిపాదన మేరకు గోదావరి నది తీరాన పుష్కర ఘాట్ సమీపాన శివాలయంనకూ విచ్చేసే భక్తుల సౌకర్యార్దమ్ 44 లక్షలు సిఎస్ఆర్ నిధులు వెచ్చించీ“శ్రీరస్తూ సింగరేణి కళా భవన్” లో సువిశాలమైన కమ్యూనిటి హల్,డ్రెస్సింగ్ రూమ్ లు,అన్ని వసతులతో నిర్మించడం జరిగింది అన్నారు. కొండాయి గూడెం, రామాంజవరం,చుట్టూ పక్కల గ్రామాల వారు,దూర ప్రాంతాల నుండి ఆలయానికి వచ్చే భక్తులకు సింగరేణి కలిపించిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని తెలిపారు.ఇక నుండి శ్రీరస్తూ సింగరేణి కళా భవన్ నిర్వహణ భాద్యతలను నిర్వహించేందుకు దేవాలయ కమిటీ అప్పగించడం జరిగింది అని ఏరియా అధికార ప్రతినిది ఎస్ రమేశ్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం విజయ కుమారి,జెడ్పీటీసీ పోశం.నరసింహ రావు,సొసైటీ చైర్మన్ కుర్రి.నాగేశ్వర రావు,ఎస్ ఓ టు జిఎం డి లలిత్ కుమార్, ఏజిఎం సివిల్ డి.వెంకటేశ్వర్లు, ఏరియా ఇంజినీర్ నర్సీ రెడ్డి, డిజిఎం పర్సనల్ ఎస్.రమేశ్, టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ వి. ప్రభాకర్ రావు,సెక్యూరిటి అదికారి షబ్బీర్ ఒద్దీన్,సర్పంచ్ బి.సతీశ్,రామాంజవరం, బిఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,కార్యదర్శి రామి రెడ్డి,సీపీఐ నాయకులు అయోధ్య,శివాలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.