మన్యం న్యూస్ కరకగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం సమత్ భట్టుపల్లి గ్రామంలో సుమారు రూ.2 కోట్ల 50 లక్షలు అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టిన మినీ స్టేడియాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఅర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు,రేగా కాంతారావు పరిశీలించారు.అనంతరం అక్కడ జరుగుతున్న పనులు వివరాలను పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినీ స్టేడియం పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఆదివాసి యువత క్రీడల్లో రాష్ట్రస్థాయిలో జాతీయస్థాయిలో రాణించాలని ఉద్దేశంతో మినీ స్టేడియాన్ని పనులు చేపట్టామని ఆయన అన్నారు. గ్రామాలలో యువకులు క్రీడల పట్ల అంకితభావంతో ప్రేమతో ముందుకెళ్లాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మండల బిఅర్ఎస్ నాయకులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
