మాన్యం న్యూస్, దమ్మపేట, ఏప్రిల్, 21: దమ్మపేట మండలం, అక్కినేపల్లి గ్రామపంచాయతీ, రంగువారిగూడెం గ్రామంలో గత రెండు రోజుల క్రిందట గ్యాస్ బండ లీకై రెండు గుడిసెలు పూర్తిగా దగ్ధం కావడంతో ఆ రెండు కుటుంబాలకు అండగా నిలిచిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం. వారి వంతు సహాయంగా 5 వేల రూపాయలు అందజేసి ఆ రెండు కుటుంబాలను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని నింపారు. దమ్మపేట మండలం, మండల రెవెన్యూ కార్యాలయం వద్ద తెలంగాణ ఐకెపి మరియు విఓఎ ఉద్యోగ సంఘం వారి నిరవధిక సమ్మే చేపట్టగా, ఆ ఉద్యోగులకు పూలమాల వేసి సంఘీభావం తేలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి 9 న్యాయబద్దమైన డిమాండ్లు పనికి గౌరవ వేతనము, ఆరోగ్య భీమా, ఆరోగ్య కార్డులు, సెర్ప్ ఉద్యోగులుగా తక్షణమే గుర్తించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మండల కన్వీనర్ కొనకళ్ల శ్రీనివాసరావు, పొట్టా భీముడు, తనికెళ్ళ యేసుపాదం, ఎలికీ వెంకటేష్, కుక్కల సత్యవాణి, లక్ష్మీరాజ్యం, కమల, హైమావతి, మహిళ ఐకెపి మరియు విఓఎ లు తదితరులు పాల్గొన్నారు