*మన్యం న్యూస్,ఇల్లందు టౌన్.. ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ సందర్భంగా ఇల్లందు నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులకు ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు హరిప్రియ హరిసింగ్ నాయక్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం సోదర సోదరీమణులంతా ఈద్ ఉల్ ఫితర్ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. రంజాన్ మాసంలో ఎంతో నిష్టతో ఆచరించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలు.. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయని తెలిపారు. హిందూ, ముస్లిం భాయి భాయి అని మతంతో సంబంధంలేని పవిత్ర పండుగ రంజాన్ అని, మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందని హరిప్రియ హరిసింగ్ నాయక్ గుర్తుచేశారు. గంగా, జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక అని, లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, వారి సంక్షేమానికి ప్రతి ఏటా భారీగా నిధులు కేటాయించి ఎన్నో కార్యక్రమాలు అమలుచేస్తున్నదని పేర్కొన్నారు.