UPDATES  

 అన్నదాతకు అందుబాటులో ‘న్యాయం’ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు గ్రామాలలోని రైతులకు వ్యవసాయ సలహాలు, న్యాయ సహాయాన్ని ఉచితంగా అందించడం కోసం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ భద్రాది కొత్తగూడెం ఆధ్వర్యంలో రైతు వేదిక, లోతు వాగు గ్రామం, లక్ష్మీదేవి పల్లి మండలంలో శుక్రవారం వ్యవసాయ న్యాయ సహాయ కేంద్రం(అగ్రీ లీగల్ ఎయిడ్ క్లినిక్ ) ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట సాగు నుంచి దిగుబడి వచ్చాక మార్కెట్లో సరైన మద్దతు ధర లభించక రైతులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని, ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించే విషయంలో అవసరమైన న్యాయ సహాయాన్ని ఉచితంగా అందించడమే వ్యవసాయ న్యాయ సహాయ కేంద్రం ముఖ్య ఉద్దేశమని న్యాయమూర్తి తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొట్ట మొదటిసారిగా రైతు వేదిక లోతువాగు గ్రామంలో ప్రారంభించడం జరుగుతుందని మరో వారం రోజులలో భద్రాచలం, మణుగూరు,ఇల్లందు లలో ఈ వ్యవసాయ న్యాయ సహాయ కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. విత్తన చట్టం ప్రకారం సర్టిఫికెట్ పొందిన కంపెనీ నుంచి విత్తనాలను సేకరించాలని, రైతులు విత్తనాలను కొనుగోలు చేసినప్పుడు రసీదును తమ దగ్గర పెట్టుకోవాలని తెలిపారు.గ్రామాలలోని రైతులకు వ్యవసాయ సలహాలు, న్యాయ సహాయం ను ఉచితంగా అందించడం కోసం పారాలీగల్ వాలంటరీ అందుబాటులో ఉంటారని తెలిపారు. రైతులకు చట్టాలపై అవగాహన కల్పించేందుకుగాను న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. దిశ స్కీమ్ లో భాగంగా రైతులకు చట్టాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.దీప, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ కుమార్ మక్కడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె. అభిమన్యుడు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జె.మరియన్న, చీఫ్ లిగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వి.పురుషోత్తం రావు, డిప్యూటీ కౌన్సిల్ నిరంజన్ రావు, లోతు వాగు సర్పంచ్ ప్రశాంత్, లక్ష్మీదేవి పల్లి ఎస్సై ప్రవీణ్, ప్రశాంతినగర్ సర్పంచ్ చంద్రశేఖర్, అసిస్టెంట్ కౌన్సిల్ జి. నాగ స్రవంతి, జనరల్ సెక్రెటరీ కాసాని రమేష్,ఆర్. రామారావు,సావు సంతోష్, పి.రామారావు, సీనియర్ న్యాయవాది లక్కినేని సత్యనారాయణ, మెండు రాజమల్లు, లక్మిదేవిపల్లి మండల వ్యవసాయ అధికారి రాకేష్, లోతు వాగు వ్యవసాయ విస్తరణ అధికారి లతా, రైతులు, వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !