UPDATES  

 గౌతంపూర్‌కు జాతీయ పురస్కారం పట్ల మంత్రి పువ్వాడ అభినందనలు.. ఆరోగ్య పంచాయతీ విభాగంలో ఎంపిక

  • గౌతంపూర్‌కు జాతీయ పురస్కారం పట్ల మంత్రి పువ్వాడ అభినందనలు..
  • ఆరోగ్య పంచాయతీ విభాగంలో ఎంపిక.
  • రాష్ట్రపతి చేతుల మీదుగా సర్పంచ్‌కు అవార్డు ప్రదానం పట్ల హర్షం.
  • కలెక్టర్‌ అనుదీప్‌, డీపీవో రమాకాంత్‌, కార్యదర్శి షర్మిల లకు మంత్రి అభినందనలు.

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి..
ఆరోగ్య పంచాయతీ విభాగంలో ఎంపికైన చుంచుపల్లి మండలం గౌతంపూర్‌ గ్రామ పంచాయతీకి ఉత్తమ పంచాయతీగా జాతీయ స్థాయిలో పురస్కారం లభించిడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు.
ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో సోమవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సర్పంచ్‌ పొడియం సుజాత అవార్డు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్, జెడ్పీ సీఈవో విద్యాలత, డిపిఓ రమాకాంత్, సర్పంచ్ సుజాత, పంచాయతీ కార్యదర్శి షర్మిల, ఎంపీ ఓ సత్యనారాయణ, శుక్రవారం వీడివోఎస్ కాలనీ లోని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారికి శాలువాకప్పి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ ఇలాంటి అరుదైన గౌరవం భద్రాద్రి జిల్లాకు దక్కడం ఇది రెండోసారి అని, జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ సారథ్యంలో గతంలో స్వచ్ఛ గ్రామీణ్‌కు జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు రావడంతో జిల్లాకు గర్వకారణం అన్నారు.
తెలంగాణలో సంక్షేమ పథకాల అమలు, జరుగుతున్న అభివృద్ధి దేశానికి గీటురాయిగా నిలవడంలంటిదన్నారు.నేడు ఉత్తమ పంచాయతీలో ఆరోగ్య పంచాయతీ విభాగంలో జిల్లా, రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చుకొని నేడు జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికై ప్రశంసలు అందుకున్న యంత్రాంగానికి అభినందనలు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !