మన్యం న్యూస్,ఇల్లందు టౌన్ ..రాఘబోయినగూడెం గ్రామ పంచాయతీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు శుక్రవారం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్యని ఇల్లందు పట్టణంలో గల క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కోరం కనకయ్యకు అందజేశారు. గ్రామ పంచాయతీ పరిదిలోగల డబుల్ బెడ్రూం గృహ సముదాయ ప్రాంగణంలో తీవ్ర నీటి సమస్య ఉందని, జిల్లా పరిషత్ నిధులతో బోర్లు ఏర్పాటు చేసి నీటి ఎద్ధడి లేకుండా నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా గ్రామంలో అసంపూర్తిగా నిలిచి ఉన్న పలు ఆలయాల పునఃనిర్మాణం గురించి ప్రస్తావించగా సానుకూలంగా స్పందించిన కోరం తనవంతు సహాయ సహకారాలు తప్పక అందిస్తానని హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోరంని కలిసిన వారిలో మాజీ సర్పంచ్ కున్సోత్ రాము, నాయకులు బియ్యాని సుధాకర్, శంకర్, ఆముధాల ప్రసాద్, గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.