మన్యం న్యూస్ మణుగూరు టౌన్.. మణుగూరు పట్టణం లోని సుందరయ్య నగర్ ఏరియాకి చెందిన బి.సందీప్ కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 18 వేల రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు వారి చేతుల మీదుగా బాధితులకు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ,అనారోగ్యానికి గురై,ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలకు సీఎం సహాయక నిధి గొప్ప వరం అన్నారు.ఆస్పత్రులలో చికిత్సలు చేయించుకొని,ఆర్థిక సహాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించారన్నారు.పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా బిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.ఈ కార్యక్రమం లో మణుగూరు జడ్పిటిసి పోశం.నరసింహారావు,బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు,కార్యదర్శి నవీన్,పార్టీ నాయకులు శ్రీను, కృష్ణ,యువజన నాయకులు రవి ప్రసాద్,రుద్ర వెంకట్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.