మన్యం న్యూస్ చండ్రుగొండ,ఏప్రిల్ 22 : శుక్రవారం అర్దరాత్రి గాలివాన మండలంలో భీభత్సం సృష్టించింది. …. మండల వ్యాప్తంగా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ మసూద్ అలీ రేకుల ఇంటిలో నిద్రస్తుండగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుఝాము వరకు గాలివాన కురవడంతో రేకుల మొత్తం దూరంగా పడిపగిలిపోయినాయి. ఇంట్లో వస్తువులు(నిత్యవసర సరుకులు) తడిసి ముద్దయినాయి. సుమారు రూ.50వేల వరకు ఆస్థినష్టం వాటిల్లిందని, తనను ఆదుకోవాలని బాధితుడు అధికారులను కోరాడు. అయ్యన్నపాలెంలో రాలిన మామిడి కాయలు గ్రామంలో ఈదురు గాలితో కూడిన వాన అర్ధరాత్రి ఒక్కసారి రావడంతో కోతకు వచ్చిన మామిడి కాయలు నేలమట్టమైనాయి.అయ్యన్నపాలెం గ్రామానికి చెందిన నరుకుళ్ల వాసుకు చెందిన ఏడు ఎకరాల మామిడి తోటలో మామిడి కాయలు పూర్తిగా నేలమట్టమైనాయి. సుమారు రూ.1.50లక్షల పంటనష్టం వాటిల్లిందని బాధిత రైతు తెలిపాడు. అడేవిధంగా మండలంలోని దాదాపు అన్ని గ్రామాలకు కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిప్పనపల్లి గ్రామానికి వెళ్లే కరెంటు సరఫరా స్థంభాలు రెండు విరగటంతో రోజంతా కరెంటు లేకుండా గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోతకు వచ్చిన వరిపైరు సైతం గింజలు రాలినాయని రైతులు వాపోతున్నారు. అధికారులు గ్రామాల్లో తిరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని మండల వాసులు తెలుపుతున్నారు.