మన్యం న్యూస్ మణుగూరు టౌన్: ఏప్రిల్ 22
మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణంలోని సీఎస్పీ వద్ద గల ఈద్గా లో ఏర్పాటు చేసిన రంజాన్ పండుగ వేడుకలకు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు హాజరై ముస్లిం,సోదర,సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కూనవరం గ్రామపంచాయతీ పరిధిలోని బొంబాయి కాలనీ ఈద్గా దగ్గర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పండుగ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ,ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.రంజాన్ ఉపవాస దీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకొని,క్రమశిక్షణ,సహోదరత్వం,దైవభక్తి,ఆధ్యాత్మికచింతన స్ఫూర్తితో ‘ఈద్ ఉల్ ఫితర్’ పర్వదిన వేడుకలను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని విప్.రేగా ఆకాంక్షించారు.అల్లా దీవెనలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా, భగవంతుని ఆశీర్వాదాలు అందాలని విప్ రేగా కాంతారావు కోరుకున్నారు. ముస్లిం ప్రజానీకానికి సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని, ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు.షాది ముబారక్ పథకం ద్వారా ప్రతి పేదింటి ముస్లిం ఆడబిడ్డల కు 1 లక్ష 116 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అన్నారు.ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి, సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు.సర్వ మతాలకు,సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని అన్నారు.ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పిటిసి పోశం. నరసింహారావు,పిఎసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు వి.ప్రభాకర్ రావు,ఎంపిటిసిల సంఘం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు,కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా, సర్పంచ్ ఏనిక ప్రసాద్,బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, ముస్లిం మైనారిటీ నాయకులు హబీబ్,యూసఫ్ షరీఫ్,బాబి జాన్,రహీం,బిఆర్ఎస్ పార్టీ నాయకులు,యువజన నాయకులు,ముస్లిం మత పెద్దలు ముస్లిం సోదరులు, తదితరులు పాల్గొన్నారు.