మన్యం న్యూస్,ఇల్లందు టౌన్ పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం ముస్లిం సోదరులు మసీదులు, దర్గాల్లో ఉదయం నుంచే ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద ముస్లిం సోదరులు నిర్వహించిన ప్రత్యేక నమాజు కార్యక్రమానికి ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రార్థనలను కనులారా వీక్షించారు. అనంతరం హరిప్రియ మాట్లాడుతూ..ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ఆ అల్లాని వేడుకున్నట్టు తెలిపారు.భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణా రాష్ట్రం ప్రతీకగా నిలిచిందని ఎమ్మెల్యే భానోత్ హరిప్రియహరిసింగ్ నాయక్ పేర్కొన్నారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు దోహదపడ్డాయని ఆమె తెలిపారు. పేద ముస్లిం సోదరీమణుల వివాహానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షాది ముబారక్ ద్వారా 1,00,016 రూపాయలను అందిస్తుందని, మైనారిటీ రుణాల ద్వారా యువతకు కూడా వారు ఎంచుకున్న రంగంలో శిక్షణ అందించి తగు ఆర్థిక సహాయాన్ని అందజేసి వారు ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. పరమ పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో నెల రోజులుగా కఠోరమైన దీక్ష చేపట్టి రంజాన్ పర్వదినం రోజున ఉపవాస దీక్షలను విడిచి భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగ జరుపుకుంటున్న ముస్లిం సమాజానికి హరిప్రియ నాయక్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. యావత్ తెలంగాణ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ శాంతి సామరస్యాలు ఫరీడవిల్లాలన్న సంకల్పంతో నెల రోజులుగా కఠోర దీక్షలు చేసిన వారి ప్రార్ధనలకు అల్లాయే మోక్షం కలిగిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. సర్వమత ఆచార వ్యవహారాలను గౌరవించడంలో తెలంగాణా ప్రత్యేకతను చాటుకుందన్నారు. ముస్లింలను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ డీవీ, మున్సిపల్ వైస్ చైర్మన్ సయ్యద్ జానీపాషా, మున్సిపల్ కమిషనర్ అంకుషావలి, జిల్లా అధికార ప్రతినిధి పులిగండ్ల మాధవ్, పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు సుధీర్ తోత్ల, పరుచూరి వెంకటేశ్వరరావు, సయ్యద్ ఆజాం, మసూద్ రబ్బు, ఇల్లందు మండల కోఆప్షన్ సభ్యులు ఘాజి, ఇల్లందు పట్టణ ఉపాధ్యక్షులు అబ్దుల్ నబీ, ఎస్కే పాషా, మురళి, సనా రాజేష్, పర్రె శ్రీనివాస్, ఇల్లందు పట్టణ అధికార ప్రతినిధి ప్రతినిధి కుంట నవాబు, కటకం పద్మావతి, ఇల్లందు మండల ఇంచార్జ్ యల్లమద్ది రవి, ఇల్లందు పట్టణ యూత్ ప్రెసిడెంట్ మెరుగు కార్తీక్, ఇల్లందు పట్టణ యూత్ ప్రధాన కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇన్చార్జి గిన్నారపు రాజేష్, ప్రచార కార్యదర్శి సత్తాల హరికృష్ణ, యువజన నాయకులు పాలడుగు రాజశేఖర్ నెమలి నిఖిల్, ముస్లిం మతపెద్దలు తదితరులు పాల్గొన్నారు.