మన్యం న్యూస్ చర్ల :
చర్ల మండలంలోని వివిధ గ్రామాల్లో సిపిఐ ఎంఎల్ 139 వ ఆవిర్భావ దినోత్సవం,లెనిన్ 153 జయంతిని ఎర్రజెండాలు ఎగరవేసి నిర్వహించడం జరిగింది.సి పి ఎం ఎల్ న్యూడెమోక్రసీ పార్టీ భూమికొరకు,బుక్తికొరకు,పేద ప్రజల విముక్తి కొరకు పోరాడి అనేక మందికి భూములును పంచి, రైతు కూలీల రేట్లు పెంపు కొరకు భూస్వాముల మెడలు వంచినటువంటి చరిత్ర ఉందని సీపీఐ యం.ల్ న్యూడెమోక్రసి చర్ల మండల కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు.అదేవిధంగా చార్ మసుందర్ నాయకత్వం నుంచి నేటి వరకు అనేక ఉద్యమాలు చేసి గోదావరి లోయ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి, అన్యం పుణ్యం తెలియని అడివిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసుల కోసం వారి యొక్క హక్కులు విధుల కోసం పోట్లాడి సాధించి పెట్టిన దాంట్లో ముందు ఉన్నది సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ అని ఆయన అన్నారు. ఎంతోమంది అమరవీరులు ఈ పేద ప్రజల కోసం పేద ప్రజల భూమి కోసం ఆదివాసి హక్కుల కోసం తమ నిండు ప్రాణాల్ని అర్పించి ఎర్రజెండాకు నెత్తురు అద్దినటువంటి చరిత్ర ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్, ప్రతాప్, శ్రీను, వీరయ్య, సాంబ, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.