నిరుద్యోగులను చైతన్య పరచడానికే నిరుద్యోగ నిరసన ర్యాలీ
– నిరుద్యోగ నిరసన ర్యాలీ కి నిరుద్యోగులు తరలిరావాలి
– ఎమ్మెల్యే పోదెం వీరయ్య
మన్యం న్యూస్, భద్రాచలం :
ఈ నెల 24న పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మం వేదికగా జరగబోయే నిరుద్యోగ నిరసన ర్యాలీ కు నిరుద్యోగులు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు పోదెం వీరయ్య పిలుపునిచ్చారు. శనివారం భద్రాచలం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు పొదెం వీరయ్య మాట్లాడుతూ… నీళ్లు, నిధులు, నియామకాలు కోసం ఎంతో మంది అమరవీరుల ఆత్మబనిధానాలతో ఏర్పడిన తెలంగాణలో నేడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయక ఎంతో మంది నిరుద్యోగులుగా మిగిలారని అన్నారు. ఉన్నత చదివి, ఉద్యోగ అవకాశాలు లేక కుటుంబ పోషణ కొరకు ఎంతో మంది కూలీనాలీ చేసుకుంటూ బతకవలసిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిందని విమర్శించారు. ఉన్నత చదువులు చదువుకొని నిరుద్యోగులుగా మిగిలిపోయిన ఆ యువతను చైతన్య పరిచి, యుద్ధానికి సిద్ధం చేసేందుకే కాంగ్రెస్ పార్టీ “ నిరుద్యోగ నిరసన ర్యాలీ ” అని ఆయన తెలిపారు. ఈ నెల 24న పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మం వేదికగా జరగబోయే “నిరుద్యోగ నిరసన ర్యాలీ ” కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు, నిరుద్యోగులు అత్యధిక సంఖ్యలో హాజరై నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేసేందుకు ఖమ్మం తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సరెళ్ళ నరేష్, పిసిసి జనరల్ సెక్రటరీ ఆవుల రాజిరెడ్డి, పినపాక, అశ్వరావుపేట సమన్వయకర్త, పిసిసి సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బలుసు నాగ సతీష్, సరెళ్ళ వెంకటేష్, పినపాక నియోజవర్గ కాంగ్రెస్ నాయకులు పిసిసి సభ్యులు చందా సంతోష్, బట్టా విజయ్ గాంధీ, భజన సతీష్ తదితరులు పాల్గొన్నారు.