మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:ఇల్లందు మున్సీపాలిటిలోని నాలుగవ వార్డు నందు రంజాన్ పండుగ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాజా గౌస్ మోనిధ్ధిన్ ఆధ్వర్యంలో ఆయన ఇంటి వద్ద ముస్లీం సోదరులకు విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ ఇన్చార్జి చీమల వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరై ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని, ఆ అల్లా దేవుని ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని చీమల ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మండల పార్టీ అధ్యక్షులు పులి సైదులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్, టౌన్ ప్రధాన కార్యదర్శి జాఫర్, సీనియర్ నాయకులు తోట వెంకటేశ్వర్లు, అలెం రవి, 19 వార్డు నాయకులు సైదులు , సైదమ్మ, రాంజీ తదితరులు పాల్గొన్నారు.