మన్యం న్యూస్ మంగపేట.
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆకినేపల్లి మల్లారం, ఎస్ టి కాలనీ మల్లారం ప్రభుత్వ పాఠశాలలో సర్వే చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు పూస అరవిందు మాట్లాడుతూ మంగపేట మండలం అకినేపల్లి మల్లారంలో ప్రభుత్వ పాఠశాలలో బిల్డింగ్ పెచ్చులు పెచ్చులు ఊడుతుందని విద్యార్థులు బిల్డింగ్ కింద కూర్చుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది అని తెలియజేశారు.మల్లారం ఎస్టీ కాలనీలో బాత్రూం లేక, కాంపౌండ్ వాల్, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.అధికారులు ఇప్పటికైనా దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మురళి, రఘు, తదితరులు పాల్గొన్నారు