మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఏప్రిల్ 22::
పోడు సాగు చేస్తున్న ఆదివాసి గిరిజన అందరికీ పట్టాలు ఇవ్వాలని లేకుంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మండలంలోని లచ్చిగూడెం గ్రామంలో కొత్తపల్లి మారాయి గూడెం లచ్చిగూడెం నారాయణరావుపేట గ్రామ పంచాయతుల నుండి సిపిఎం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం వీరభద్రం అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా అటవీ హక్కుల గుర్తింపు చట్టని పకడ్బందీగా అమలు చేసి పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు మండలంలో 17 ఎకరాలు సాగు చేస్తున్నారని వారందరికీ హక్కు పత్రాలు ఇవ్వాల్సిందేనని అలానే ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి ప్రగల్లపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ మారుమూల గ్రామాలకు సాగునీరు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సీనియర్ నాయకులు ఎలమంచి రవికుమార్ మండల కార్యదర్శి కారం పుల్లయ్య మండల కమిటీ సభ్యులు నాగమణి ప్రసాద్ తిరుపతిరావు ఎంపీటీసీ సీతమ్మ భద్రయ్య తదితరులు పాల్గొన్నారు