మన్యం న్యూస్, పినపాక
పినపాక మండలంలో రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మసీదులుు ముస్లిం సోదరులతో కిటకిటలాడాయి. పిల్లా పెద్దా అనే తారతమ్యం లేకుండా పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి ఈద్గాలకు వచ్చిి ప్రార్థనలు జరిపారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆలింగనం చేసుకున్నారు. ఈ.బయ్యారం, జానంపేట, పినపాకలో రంజాన్ వేడుకలలో ఎస్సై నాగుల్ మీరా ఖాన్ పాల్గొన్నారు.
ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.