మాన్యం న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్ 22: ఛలో ఆదిలాబాద్ జిల్లా, గుడిహత్నూర్ లో ఈ నెల 29, 30 తేదిలో నిర్వహించేటటువంటి ఆదివాసీ సేన మహాసభలను, జయప్రదం చేయాలని అశ్వారావుపేట మండలం తిమ్మాపురం, వేదాంత పురం గ్రామలలో ఆదివాసీ సేన కరపత్రం ఆవిష్కరణ శనివారం నిర్వహించారు. తదనంతరం ఆదివాసి సేన జిల్లా కమిటీ సభ్యులు బేతి రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ లో 11, కులాలను ఎస్టీ జాబితాలో కలుపుతూ తీర్మానం చేయడం సరైంది కాదని అట్టి తీర్మానం రాజ్యoగబద్ధమైనది కాదని, వెంటనే దానిని రాష్ట్ర ప్రభుత్వం ఉపసహరించుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాల రూపంలో తగిన బుద్ధి చెప్తామని వారు హెచ్చరించారు. అలాగే ఎమ్మెల్యేలను కూడా గ్రామాలలో తిరగనివ్వకుండా తగిన బుద్ధి చెప్తామని వారు హెచ్చరికలు జారీ చేశారు. గ్రామ గ్రామాన ఎమ్మెల్యేల చేతగాని తనాన్ని తెలియజేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బేతి నాగమ్మ, పద్దం చుక్కమ్మ, దుర్గారావు, ముత్తమ్మ, బ్రహ్మమ్మ, ముత్యాలరావు, పూసప్ప, కన్నయ్య, ముత్తమ్మ, అక్కమ్మ, వినోద్ తదితరులు పాల్గొన్నారు.