మన్యం న్యూస్ మణుగూరు టౌన్:ఏప్రిల్ 22
మణుగూరు పట్టణంలోని ఆదర్శనగర్ ఏరియాకు చెందిన దండగుల అయ్యప్ప గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో విషయం తెలుసుకోని శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించారు. వారి యోగక్షేమలు అడిగి తెలుసుకొని,నేను ఉన్నాను అంటూ భరోసా కల్పించారు. అనంతరం మణుగూరు మండలం పివి కాలనీ చెందిన ఎండి.యుసస్ (85) అనారోగ్యంతో మరణించడంతో విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి మృతుడి పార్థివ దేహానికి విప్ రేగా నివాళులర్పించారు.బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి,వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోశం.నర్సింహారావు, సొసైటీ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు బిఆర్ఎస్ పార్టి పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శి నవీన్, నాయకులు వట్టం.రాంబాబు, కృష్ణ,నుకారపు.రమేష్,యువజన నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.