UPDATES  

 రహాదారి, కరెంట్, నీటి కష్టాలు తీర్చండి సర్పంచ్ కి గ్రామస్థులు వినితి

 

మాన్యం న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 22: రహాదారి, కరెంట్, నీటి కష్టాలు తీర్చండి అంటూ మండల పరిదిలోని ఊట్లపల్లి గ్రామపంచాయితీ, కొత్త నల్లబాడు గ్రామస్థులు స్థానిక సర్పంచ్ సాధు జోత్స్నా భాయ్ కి వినితి పత్రం శనివారం అందించారు. గత 20 సంవత్సరాలుగా కరెంటు మంచినీళ్లు సరైన రహదారి లేక ఆ గ్రామస్తులు కిలోమీటర్ల దూరం వెళ్లి మంచినీళ్లు తెచ్చుకోవడం జరుగుతుందని, 30 కుటుంబాలు ఉన్న గ్రామంలో సమస్యలు తీర్చాలని సర్పంచ్ని వేడుకున్నారు. స్పందించిన సర్పంచ్ జోత్స్నా సమస్యను ఉన్నత అధికారులు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తానని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నల్లబాడు గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !