మన్యం న్యూస్ వాజేడు.
దేశం కోసం సరిహద్దుల్లో పోరాడుతూ సెలవు నిమిత్తం స్వగ్రామానికి వచ్చారు. ఎయిర్ కూలర్ లో నీళ్లు పోస్తూ, కరెంట్ షాక్ తో మృతి చెందారు. తాటి మహేందర్ కు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి. మహేందర్ నివాసం నుంచి రేగులపాడు,చెరుకూరు,పెద్ద గొల్లగూడెం గ్రామాలలో అంతిమయాత్ర జరగగా.. భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి వీరుడికి తుది నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వాజేడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ అశోక్, ఐ టి బిపి సైనికులు, పలు గ్రామాల ప్రజలు బారి సంఖ్యలో హాజరై భారతదేశ సైనికుడికి అంతిమ వీడ్కోలు పలికారు.