మన్యం న్యూస్ మణుగూరు టౌన్: ఏప్రిల్ 23
మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదివారం రామానుజవరం గ్రామం ఆదరణ వృద్ధాశ్రమం మౌలిక వసతులు,అభివృద్ధి కోసం రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.10 వేల రూపాయల నగదును ఎడవల్లి మలాకి వారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో విప్ రేగా వ్యక్తిగత సహాయకులు, మహేశ్వరం సాయినాథ్, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు సాగర్ యాదవ్,నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ సందీప్ రెడ్డి, యువజన నాయకులు శ్రీకాంత్,పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.