మన్యం న్యూస్, మంగపేట.
మన్య సీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు గొప్ప వీరయ్య పత్రికలకు మన్యసీమ పరిరక్షణ సమితి, డోలు దెబ్బ తరపున ప్రెస్ నోటు విడుదల చేశారు.
షెడ్యూల్డ్ ఏరియాలో ఏజెన్సీ ప్రాంతములో మంగపేట మండలం సర్వే నెంబర్ 125/1లో 0-03గుంటల భూమి గంపోనిగూడెం గ్రామము నందు తప్పుడు ఆలోచనతో అక్రమంగా కట్టిన ఇల్లును తొలిగించాలి.ఏ అధికారులు పగిడిపెల్లి వెంకటేశ్వర్లు కు ఇంటి స్థలము కేటాయించలేదని జిల్లా కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అధికారులు గిరిజనేతరుడు అయిన పగిడిపెల్లి వెంకటేశ్వర్లు అక్రమ ఇంటి నిర్మాణము తొలిగించుటకు ఆదేశాలు ఉన్నకానీ. రెవిన్యూ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. తహసీల్దార్ ఇప్పటికైనా అక్రమ నిర్మాణములను తొలిగించాలని మన్యసీమ పరిరక్షణ సమితి, డోలు దెబ్బ సంఘం నుంచి డిమాండ్ చేశారు.
