మన్యం న్యూస్, పినపాక:
మండల పరిధిలోని ఏడూళ్ళ బయ్యారం గ్రామపంచాయతీకి చెందిన తునికి రాము పాడి పశువును ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో మేతకి విడిచినారు. కొద్దిసేపటికే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడం వల్ల పిడుగుపాటుకు పాడి పశువు మృతి చెందింది. దీంతో సమాచారం అందుకున్న పినపాక మండల పశు వైద్యాధికారి డాక్టర్ బాలకృష్ణ చవాన్ స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని మరణించిన పశువు, యజమాని తాలూకా వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం సమీప డంపు యార్డ్ కి తరలించాల్సిందిగా రైతుకి తెలియ చేశారు.