మన్యం న్యూస్ చండ్రుగొండ,ఏప్రిల్ 23: మండల పరిధిలోని మద్దుకూరు గ్రామంలో పెద్దమ్మతల్లి జాతర ఘనంగా నిర్వహించారు. ఆదివారం పెద్దమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, తమ మొక్కులు చెల్లించారు.తొలుత అమ్మవారు అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమంతో ప్రాంభమై, భక్తులు తలస్నానాలు చేసి అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. జాతర ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో జాతర వచ్చిన భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సదుపాయాలను కల్పించారు. జాతరకు చుట్టూ ప్రక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో గిరిజన భక్తులు పాల్గొని పూజలు చేశారు.