UPDATES  

 తిమ్మంపేట లో బి ఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం ప్రతి కార్యకర్త గెలుపే లక్ష్యం గా పని చేయాలి

మన్యం న్యూస్, మంగపేట.
రానున్న రోజుల్లో బి ఆర్ ఎస్ ను తిరుగులేని శక్తిగా తయారుచేసి ప్రతి కార్యకర్త గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పలువురు వ్యాఖ్యానించారు మంగపేట మండలం లో ఆదివారం మంగపేట మండలం తిమ్మంపేట క్రాస్ లో నిర్వహించిన బి ఆర్ ఎస్ పార్టీ మండల ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు, తోలేం నర్సింహారావు, ఎస్సి సెల్ మండల అధ్యక్షులు మోదుగు బాబు, బీసీ సెల్ మండల అధ్యక్షులు శానం నరేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ ఎస్టీ ఎస్సి ఆత్మీయ సమ్మేళనం సమావేశానికి ముఖ్య అతిధులుగా హాజరైన మండల పార్టీ అధ్యక్షులు మంగపేట ,మాజీ ఎంపీటీసీ సర్పంచ్ కుడుముల లక్ష్మీనారాయణ హాజరై వారు మాట్లాడుతూ ములుగు జిల్లాలో మరల గులాబీ జెండా రెప రెప రెపలాడాలి. గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు.పేదల పెన్నిధి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేద కుటుంబాల ప్రజలకు అందుతున్నాయి అన్నారు. మండలంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలలోకి తీసుకువెళ్లాలని అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా బీఆర్ఎస్ పార్టీ కాపాడుకుంటుంది అన్నారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు హాజరు అయ్యారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !