మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ అనుసరిస్తున్న తీరు అమోఘమని ఫ్రెండ్లీ పోలీసింగ్ ను అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పరిచి నేర నియంత్రణలో అంకితభావంతో విధులను నెరవేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల కృషి అభినందనీయమని ప్రభుత్వం బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ శ్జి.వినీత్ తో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు భేటీ అయ్యారు, ముఖ్యంగా భద్రాద్రి జిల్లాలో ప్రస్తుత నెలకొన్న స్థితిగతులపై ఆరా తీశారు, శాంతిభద్రల పరిరక్షణ తీసుకుంటున్న చర్యలను వారు చర్చించారు.