మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండలంకు చెందిన పరిటాల చలపతి మాష్టారు కుమారుడైన పరిటాల జ్వలిత్ ఈ నెల 22, 23 వ తేదీలలో నల్గొండ లో జరిగిన రాష్ట్రస్థాయి ఈ పైన్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ చాంపియన్ షిప్ 13 సం॥ల బాలుర విభాగంలో బంగారు పతకం, డబుల్స్ విభాగంలో సిల్వర్ (వెండి) పతాకాలను* కైవసం చేసుకొన్నాడు. బంగారు పతకాన్ని సాధించిన జ్వలిత్ కు నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి బహుమతులు అందించారు. టేబుల్ టెన్నిస్ రాష్ట్ర స్థాయిలో బంగారు పతకం కైవసం చేసుకోవడం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటిసారి అని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఐ.పీ. గౌతమ్, డీవైఎస్ ఓ ఎం. పరంథామరెడ్డి, టేబుల్ టెన్నిస్ సంఘం కార్యదర్శి కోచ్ ఓలేటి సాంబమూర్తి తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా మీకోసం మేమున్నాం సంస్థ చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ చర్ల మండలంను రాష్ట్ర స్థాయికి తీసుకెల్లడం ఎంతో గర్వకారణం అని, రాబోయే రెండు నెలల్లో జరిగబోయే జాతీయ స్థాయి పోటీల్లో కూడా రాణించి, మరెన్నో పథకాలు సాధించాలని కోరారు.ఈవిధంగా పిల్లలను ప్రోత్సాహిస్తూ, వారిలో క్రీడా స్ఫూర్తిని నింపుతున్న పరిటాల కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేశారు.
