మన్యం న్యూస్, పినపాక
పల్లె ప్రకృతి వనానికి ఏర్పాటుచేసిన ఫెన్సింగ్ ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించుకొని పోయారు. పినపాక మండలం చేగర్షల గ్రామపంచాయతీ లో ప్రధాన రహదారికి పక్కన ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనం చుట్టూ మొక్కల రక్షణ కోసం ఏర్పాటుచేసిన ఫెన్సింగ్ ను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. ప్రధాన రహదారిపై ఉన్న ఫెన్సింగ్ సైతం దొంగతనం చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామస్తులే దొంగతనం చేశారా లేదా బయట వారు చేశారా అనే విషయం పోలీసుల దర్యాప్తులో తెలియనుంది.