మన్యం న్యూస్: జూలూరుపాడు, ఏప్రిల్ 26, ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను భద్రాద్రి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె అభిమన్యుడు బుధవారం పరిశీలించారు. మండల వ్యవసాయ అధికారి ఎస్ రఘు దీపిక తో కలసి మండల పరిధిలోని కాకర్ల, వినొబానగర్ గ్రామాలలో దెబ్బ తిన్న మొక్క జొన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంట నష్టం జరిగిన రైతుల పొలాలను చూసి, వివరాలను త్వరితగతిన నమోదు చేయాలని, వ్యవసాయ విస్తరణ అధికారులులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జి దీపక్ ఆనంద్, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఎంఏ గౌస్, లావణ్య లతోపాటు రైతులు పాల్గొన్నారు.
