UPDATES  

 గ్రామాల్లో ప్రజలకు అత్యవసర వైద్య సేవల్లో కీలకం గ్రామీణ వైద్యులే

గ్రామాల్లో ప్రజలకు అత్యవసర వైద్య సేవల్లో కీలకం గ్రామీణ వైద్యులే
గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుంది
తెలంగాణ గ్రామీణ వైద్యుల సహాయక సంఘం 6వ జిల్లా మహాసభ లో.. ప్రభుత్వ విప్ రేగా

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

గ్రామాల్లో అందుబాటులో ఉంటూ గ్రామ ప్రజలకు అత్యవసరమైన వైద్య సేవలు అందించడంలో గ్రామీణ వైద్యుల కృషి ఎంతో ఉందని వారే కీలకమన ప్రభుత్వ విప్ బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం లోని పెద్దమ్మ తల్లి గుడి ప్రాంగణం నందు గల ఎస్సార్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన తెలంగాణ గ్రామీణ వైద్యుల సహాయక సంఘం 6వ జిల్లా మహాసభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు, గ్రామాలలో ఆపదలో ఉన్న ప్రజలకు గ్రామీణ వైద్యులు ప్రధమ చికిత్స చేసి ఎంతోమంది పేద ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని వారి సేవలను కొనియాడారు, ప్రాణాలు కాపాడడానికి ప్రధమ చికిత్స ముఖ్యమని గ్రామీణ వైద్యులు పేదలకు గ్రామాలలో నిత్యం అందుబాటులో ఉంటూ వారి ఆరోగ్యాలను ప్రాణాలు కాపాడుతున్నారని వారి సేవలను కొనియాడారు, గ్రామీణ వైద్యులకు ప్రభుత్వం తరపున శిక్షణ అందించి వారి సేవలను మెరుగుపరుస్తామన్నారు .ప్రభుత్వ సంక్షేమ పథకాలలో గ్రామీణ వైద్యులకు ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు .సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం కేసీఆర్ వెంట గ్రామీణ వైద్యులు నడవాలన్నారు .గ్రామీణ వైద్యులకు అండగా ఉంటానన్నారు, వారి సమస్యలను సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ల దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తానని తాను అన్నీ విధాలుగా ఉంటానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బాలబోయిన వెంకటేశ్వర్లు గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ చారి ఉపాధ్యక్షులు కందుకూరి ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి నటరాజ్ ,డాక్టర్ శ్రీరామ్ కో-ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ వర్మ ,రాష్ట్ర నాయకులు నేతి నాగేశ్వరరావు, డాక్టర్ రేగుముడి వెంకటేశ్వర్లు కరుణాకర్, ప్రభాకర్, జివి రావు, కోట సత్యం తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !