UPDATES  

 రిటైర్డ్ అధికారిని సన్మానించిన జనరల్ మేనేజర్ దుర్గం రామ చందర్

 

మన్యం న్యూస్ మణుగూరు టౌన్: ఏప్రిల్ 26

మణుగూరు సింగరేణి ఏరియా లో సుదీర్ఘ కాలం పని చేసిన జిఎం సివిల్ సిహెచ్.రమేశ్ బాబు అందరి గుర్తింపు పొంది, ఏప్రిల్ లో పదవి విరమణ పొందుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని మణుగూరు ఏరియాకు విచ్చేసిన జిఎం సివిల్ సిహెచ్.రమేశ్ బాబు ను బుధవారం జిఎం కార్యాలయ సమావేశ మందిరంలో ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామ చందర్ చేతుల మీదుగా ఘన సన్మానం చేయడం జరిగింది.ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఏరియా జిఎం దుర్గం రామ చందర్ మాట్లాడుతూ,నిబద్ధత, నిజాయితీతో పని చేసే వారికి వృత్తి పరంగా పదవి విరమణ తప్పనిసరి అయినప్పటికీ, వ్యక్తిగతంగా మాత్రం ఉత్తమ ఉద్యోగిగా,అధికారిగా అందరి మనసులో ఎన్నటికీ చెదిరిపోనీ సుస్థిరస్థానం అలాగే ఉంటుంది అన్నారు.సంస్థకు మేలు చేకూర్చేల ఉద్యోగులకు ఉపయోగ పడడం,ఇంకా ఏదైనా చేయాలని నిత్యం తపిస్తూ తన మేధా సంపత్తితో అనేక కొత్త కార్యక్రమాలు ఆవిష్కరించిన సిహెచ్ రమేశ్ బాబు అందరికీ స్ఫూర్తి దాయకంగా నిలిచారు అన్నారు.సిహెచ్ రమేశ్ బాబు 2019 లో జిఎం సివిల్ సింగరేణి లో బాధ్యతలు చేపట్టడం జరిగింది అని,మొదలు నుంచి అంచెలంచెలుగా పదోన్నతులు పొందుతూ నేడు జిఎం సివిల్ గా పదవి విరమణ పొందుతున్న సిహెచ్.రమేశ్ బాబు సింగరేణి మొత్తంలో వివిధ ఏరియాలలో పని చేసి తమకున్న 34 సంవత్సరాల అనుభవంతో సింగరేనియులకు సంస్థకు ఎంతో మేలు చేశారు అని వారి సేవలను కొనియాడారు.సిహెచ్.రమేశ్ కు జిఎం రామ చందర్ అభినందనపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోఎస్ఓ టు జిఎం డి.లలిత్ కుమార్, ఏరియా ఇంజినీర్ నర్సీ రెడ్డి, ఏజీఎం సివిల్,డి.వెంకటేశ్వర్లు, పిఓ లక్ష్మీపతి గౌడ్,పిఓ శ్రీనివాస చారి,ఏఎస్ఓ వెంకట రమణ,డిజిఎం పర్సనల్ ఎస్ రమేశ్, డిజిఎం ఐఈడి కే.వెంకట్ రావు,డిజిఎం పర్చేస్ శ్రీనివాస మూర్తి,ఫైనాన్స్ మేనేజర్ అనురాధ,సెక్యూరిటీ అధికారి షబీరుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !