మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలంలో గురువారం పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు మండలంలోని పలు గ్రామాలను సందర్శిస్తారు. పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదారుస్తారు. పలు శుభకార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. ఈ మేరకు పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంచార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై పొంగులేటి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.