సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన కుడుముల లక్ష్మి నారాయణ
మన్యం న్యూస్, మంగపేట.
బీ ఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు జడ్పీ చైర్మన్, నియోజకవర్గ ఇన్చార్జి కుసుమ జగదీష్ చొరవతో మంజూరు చేయించిన సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంగపేట గ్రామనికి చెందిన బొల్లె వెంకట సుబ్బయ్యకి ఒక్క లక్ష రూపాయలుమంజూరు అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేసిన సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిది తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు వరం అని,ప్రైవేటు హాస్పిటల్లో వైద్యం పొంది ఆర్థికంగా అప్పుల పాలైన వారిని ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన ఈ పథకం పేదల అభ్యున్నతికి ఉపయోగపడుతుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మంగపేట గ్రామ కమిటి అధ్యక్షులు నూనె లింగయ్య , పిఏసిఎస్ వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్,పిఏసిఎస్ డైరెక్టర్ నర్రా శ్రీధర్,మాజీ జడ్పీటీసీ సిద్ధంశెట్టి వైకుంఠం, శానం నరేందర్, అనురాధ,మండల మైనార్టీ అధ్యక్షులు ఆఫ్టల్ ,మండల నాయకులు,కొమరగిరి కోదండ0,చిట్టీమల సమ్మయ్య,లోడంగి లింగయ్య, హనుమంతరావు, పగిడిపల్లి వెంకటేశ్వర్లు, బూట్టో, అయూబ్, అన్వర్,చల్లగురుగుల తిరుపతి, శ్రీనివాస్ ,మహిళలు కాటూరి సుగుణ, తిరుపతమ్మ,,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి ,పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
