మన్యం న్యూస్ మంగపేట.
మానవ సేవ యూత్ ఆధ్వర్యంలో యువతను ప్రభావితం చేసే గొప్ప కార్యక్రమాలలో భాగంగా మానవ సేవ యూత్ 2023 మంగపేట మండలం లో “బెస్ట్ యూత్ లీడర్” అనే కాంటెస్ట్ ఆన్లైన్ పోలింగ్ ద్వారా ఏప్రిల్ 22వ తారీఖున నిర్వహించగా అందులో సునీల్ కొత్తపల్లి కి 630 ఓట్లతో మొదటి స్థానాన్ని గెలుచుకోగా, మల్ రెడ్డి సుధాకర్ రెడ్డి 291 ఓట్లతో రెండో స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది.. ఈ సమాజంలో యువతరాన్ని ప్రభావితం చేసేలా అభ్యర్థులు పోటాపోటీగా ఓట్లను సంపాదించుకొని పోలింగ్ మీద ఒక అవగాహన ఈ సమాజంలో కలిగించడం జరిగింది.. మానవ సేవ యూత్ సభ్యులు బుధవారం రోజున ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్న మల్ రెడ్డి సుధాకర్ రెడ్డిని సన్మానించి ద్వితీయ బహుమతి అందించడం జరిగింది.. ఈ సందర్భంగా ఈ పోలింగ్ ను ఉద్దేశించి ద్వితీయ బహుమతి విజేత మల్ రెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజ పరంగా యువతకు సమాజ బాధ్యతను సమాజం పై అవగాహన కలిగించే ఇటువంటి పోటీని పోలింగును నిర్వహించిన మానవ సేవ యూత్ సభ్యులను అభినందిస్తున్న, మానసవ యూత్ వారు గత నాలుగు సంవత్సరాలుగా ఈ సమాజంలో మానవత్వంతో ఎంతో సేవ చేశారు వారి సేవకు ఆకర్షితులైన వారిలో నేను ఒకరిని మానవ సేవ యూత్ చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్కటి సమాజ పరంగా సమాజ హితం కోరే విధంగా యువతను ప్రభావితం చేసే లాంటివే మానవ సేవ యూత్ ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని కార్యక్రమాలలో భాగంగా నేను మానవ సేవ యూత్ నిర్వహించిన కాంటెస్ట్ లో పాల్గొన్నందుకు ఆ పోటీలో ద్వితీయ బహుమతి సాధించినందుకు గర్వపడుతున్నాను, ఎల్లవేళలా మానవ సేవ యూత్ వారు చేసే సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలు కూడా ఉంటాయనిఅన్నారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మానవ సేవ యూత్ ఫౌండర్ జై భీమ్ రామ్మోహన్, సభ్యులు జాన పట్ల జయరాజు, కర్రి చందు, చిక్కుల శ్రీకాంత్, గద్దల ప్రసాద్,లు పాల్గొన్నారు.
