మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి ఏప్రిల్ 26 :అన్నపురెడ్డిపల్లి మండలం కేంద్ర పరిధిలోని మర్రిగుడెం గ్రామ పంచాయితీ పరిధిలో గల బుచ్చన్నగూడెం గ్రామంలో బుధవారం వనవాసి కళ్యాణ పరిషత్ సేవా సంస్థ ఆధ్వర్యంలో కుట్టు మిషిన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అన్నపురెడ్డిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ షేక్ షాహీన విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.అనంతరం మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్సై మాట్లాడుతూ కుట్టు మిషన్ శిక్షణ వల్ల అనేక మంది పేద మహిళలకు,ఒంటరి మహిళలకు జీవన ఉపాధి కలుగుతుందని,అదే విధంగా ఆర్థిక భరోసా కలీగ్గిస్తుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి,డాక్టర్ మొకాల వెంకటేశ్వరావు,వనవాసి కళ్యాణ పరిషత్ మండల కో ఆర్డినేటర్ మడివి వెనకటేశ్వరావు,బుచ్చన్నగూడెం గ్రామ కో ఆర్డినేటర్ మెచ్చు నిలవేణి,బుచ్చన్నగూడెం గ్రామస్తులు తాటి నాగులు,తాటి సూర్యం,మెచ్చు సురేష్,సవలం కృష్ణ,కొండ్రు రత్నంబాబు,యువకులు తదితరులు పాల్గొన్నారు.