మన్యం న్యూస్ చర్ల:
మే 5వ తేదీన తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా భద్రాచలంలో జరుగుతున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం చర్ల మండల కమిటీ సభ్యులు మచ్చ రామారావు, సిఐటియు మండల నాయకులు పి బాలాజీ కోరారు. చర్ల మండలం పూజారి గూడెం గ్రామంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం నూతన అటవీ విధానం పేరుతో ఆదివాసి హక్కుల పైన దాడి చేస్తుందని విమర్శించారు. ఆదివాసీల సాగులో ఉన్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం గిరిజన గ్రామాల అభివృద్ధికి రావలసిన నిధులను కేంద్ర బిజెపి ప్రభుత్వం దారిమల్లిస్తుందని ఫలితంగా గిరిజన గ్రామాలు అభివృద్ధికి నోచుకోవటం లేదని పేర్కొన్నారు.విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో ఆదివాసీల అభివృద్ధికి నిధులు కేటాయింపులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివక్షతను ప్రదర్శిస్తున్నాయని పేర్కొన్నారు. చదువుకున్న నిరుద్యోగ యువతకు జిల్లాలోని సింగరేణి ఐటిసి, బిటిపిఎస్,కేటిపిఎస్, నవభారత్ వంటి ప్రభుత్వ ప్రైవేటు పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. . ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులుసంపత్ తదితరులు పాల్గొన్నారు.
