మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండలంలో ఐ ఎఫ్ టీ యూ అనుబంధ సంఘం తెలంగాణా ప్రగతిశీల మిషన్ భగీరధ వర్కర్స్ యూనియన్ చర్ల మండల నూతన కమిటీని ఆరుగురితో ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికకాబడిన ఈ కమిటీ అధ్యక్ష కార్యదర్శి లు గా సూదుల వినయ్, మద్ది లక్ష్మీనరసింహారెడ్డి లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఐ ఎఫ్ టీ యూ చర్ల మండల నాయకులు కొండా చరణ్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిస్కారంకోసం వారి హక్కులకోసం పోరాడెందుకు సంఘం నూతన కమిటీని ఎంపిక చేసుకోవడం హార్శించదగ్గ విషయమని అన్నారు. ఎన్నికైన నూతన కమిటీకి అధ్యక్షు కార్యదర్శులకు విప్లవ జేజేలు తెలిపారు. ఈ నాయకత్వం మిషన్ భగీరధ కార్మికులకు అండగా నిలబడాలని వారి హక్కులకై రాజిలేని పోరాటాలు నిర్వహించాలని అన్నారు.
