మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఏప్రిల్ 25::
దుమ్ముగూడెం గ్రామంలో వెలిసి ఉన్న రామచంద్రస్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా మంగళవారం నిర్వహించారు సీతారాములు కళ్యాణం అనంతరం నిర్వహించే ఆత్మా రామచంద్రస్వామి వారి కళ్యాణానికి దేవదాయ శాఖ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు కళ్యాణం శోభకృత నామ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి కల్యాణ తంతు నిర్వహించారు మధ్యాహ్నం 12:30 గంటలకు అభిజిత్ లగ్నమందు దేవస్థానం కళ్యాణ మండపంలో వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ కళ్యాణని నిర్వహించారు కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ కార్యక్రమంలో అర్చకులు రామానుజన్ సుదర్శన్ కిషన్ మోహన్ జూనియర్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.