వివొఏల సమస్యలు పరిష్కరించాలి
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు.
వివొఏల సమస్యలు పై కె సి ఆర్ స్పందించాలి.వివొఏ ల సంఘము రాష్ట్ర కార్యదర్శి సి హెచ్ సీతామహాలక్ష్మి డిమాండ్.
మన్యం న్యూస్. ములకలపల్లి. ఏప్రిల్ 25.తెలంగాణ రాష్ట్ర పరిధిలో సెర్ఫ్ భాగమైన వివొఏ ల సమస్యలను పరిష్కరించాలని వివొఏల సంఘము రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో మండల కేంద్రం లో జరుగుతున్న నిరవధిక సమ్మె ను ప్రారంబించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధి మహిళా సంక్షేమం కోసం పొదుపు సంఘాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎన్నో రకాల ఆన్ లైన్ పనులు,పొదుపు,బ్యాంకు ఋణాలు ల నుంచి ఇప్పించటం కోసం నిరంతరం శ్రమిస్తున్న వి వొ ఏ లకు రోజుకు 130 రూపాయలు ఇవ్వడం దారుణమైన శ్రమ దోపిడని,ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం వి వొ ఏ లకు 26 వేలు రూపాయల వేతనం ఇవ్వాలని, మమ్ములను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తుంచాలని , ఐడి కార్డ్స్ , ఇన్సూరెన్స్ , హెల్త్ కార్డు ఇవ్వాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నరాటి ప్రసాద్ , టీడీపీ మండల అధ్యక్షులు తేళ్ల చెన్నయ్య , సిపిఐ మండల కార్యదర్శి ఎండీ యూసుఫ్ ,సి ఐ టి యు సి మండల కార్యదర్శి నిమ్మల మధు , వెంకటేశ్వర్లు , వి వొ ఏ ల సంగం మండల అధ్యక్షురాలు కనక లక్మి ,సఫియా , దుర్గ ,ఆదిలక్ష్మి , , విజయ్ , సత్యనారాయణ , మహా లక్ష్మి , లక్ష్మి కుమారి , విజయ , వెంకటమ్మ , పెద్దులమ్మ , కృప , తదితరులు పాల్గొన్నారు
